కేఎల్ రాహుల్ ఔదార్యం
న్యూఢిల్లీ: ఇటీవల ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీసీసీఐ ఆగ్రహానికి గురైన టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. రాహుల్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్కు ఆర్థిక సాయం చేసి తనలోని ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఇప్పటికే పలువురు క్రికెటర్లు, మాజీలు సైతం జాకబ్ మార్టిన్కు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే కృనాల్ పాండ్య ఏకంగా బ్లాంక్ చెక్కును పంపి కావాల్సినంత తీసుకోమని కోరగా, దాదాపు అదే దారిలో నడిచాడు కేఎల్ రాహుల్. తన భర్త వైద్యానికి ఎంత అవసరో అడిగి దాన్ని సాయంగా అందించి విషయాన్ని మార్టిన్ భార్య తెలిపారు.
‘ఎంత సొమ్ము కావాలంటూ రాహుల్ మమ్మల్ని అడిగారు. ఆ రోజు సాయంత్రానికే మా ఖాతాలో డబ్బు జమ చేశారు. రాహుల్ చేసింది చాలా పెద్ద సాయం’ అని మార్టిన్ భార్య ఖ్యాతి తెలిపారు. అయితే రాహుల్ ఎంత మొత్తం ఇచ్చారనే వివరాలు మాత్రం ఆమె వెల్లడించలేదు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు