breaking news
Jacob Martin
-
22 ఏళ్ల నాటి కేసు.. నిర్దోషిగా విడుదలైన భారత మాజీ క్రికెటర్
భారత మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ 22 ఏళ్ల నాటి క్రిమినల్ కేసులో నిర్దోషిగా విడుదలయ్యాడు. 2004లో జాకబ్ మార్టిన్ పాస్‌పోర్ట్ ఫోర్జరీ చేశాడన్న ఆరోపణలు రావడంతో అతడిపై క్రిమినల్ కేసు నమోదైంది. ఐపీసీలోని సెక్షన్లు 420, 468, 471, 120బితో పాటు పాస్‌పోర్ట్ చట్టంలోని సెక్షన్ 12 కింద జాకబ్ మార్టిన్‌పై అభియోగాలు మోపబడ్డాయి.తాజాగా 22 ఏళ్ల తర్వాత పాస్‌పోర్ట్ ఫోర్జరీ, నకిలీ యూకే ఇమ్మిగ్రేషన్ స్టాంప్, ప్రయాణ ఏర్పాట్లు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి జాకబ్‌పై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదు. దీంతో పాటియాలా హౌస్ కోర్టు జాకబ్‌పై వచ్చిన ఆరోపణలన్నింటిని కొట్టివేస్తూ నిర్దోషిగా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.జాకబ్ మార్టిన్ పాస్‌పోర్ట్ అవకతవకలకు పాల్పడినట్లు గానీ, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి విశ్వసనీయమైన ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. కేసులో ముఖ్యులైన పలువురు సాక్ష్యాలు, ఆధారాలు నిరూపించడంలో విఫలమయ్యారని, అందుకే జాకబ్ మార్టిన్‌ను నిర్దోషిగా విడుదల చేస్తున్నట్లు పాటియాలా కోర్టు తమ తీర్పును వెల్లడించింది. తాను నిర్దోషిగా విడుదలవ్వడంపై జాకబ్ మార్టిన్ మీడియాతో స్పందించాడు. "2004లో యూకే పర్యటనకు వెళ్లిన జట్టులో ఒక సభ్యుడు వీసా గడువు ముగిసినప్పటికీ అక్కడే ఉండిపోయాడు. అయితే నకిలీ ఇమ్మిగ్రేషన్ స్టాంప్ పొంది భారత్‌కు తిరిగి రావడంతోనే పట్టుబడడంతో కేసు వెలుగులోకి వచ్చింది. అసలు ఎఫ్ఐఆర్లో మొదట నా పేరు లేదు. కానీ విచారణ సమయం వచ్చేనాటికి నా పేరును కేసులో చేర్చారు. తాను అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగకూడదనే ఉద్దేశంతో కొందరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఏ తప్పు చేయనప్పటికీ నేను దోషిగా తేలడం వల్ల రైల్వే ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. క్రికెటర్‌గా ఎదగలేకపోయానన్న బాధ ఒత్తిడికి గురయ్యాను. తాజాగా 22 ఏళ్ల తర్వాత కేసులో నిర్దోషిగా బయటికి రావడం ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఇది నా జీవితంలో ఒక కీలక మలుపు" అని చెప్పుకొచ్చాడు.1999లో అంతర్జాతీయ అరంగేట్రంఇక కుడిచేతి వాటం బ్యాటర్ అయిన జాకబ్ మార్టిన్ 1999 సెప్టెంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, పాకిస్తాన్లతో జరిగిన ట్రై సిరీస్‌లోనూ పాల్గొన్నాడు. తదనంతరం ఫామ్ కోల్పోవడంతో జాకబ్ జట్టులో చోటు కోల్పోయాడు.టీమిండియా తరఫున 10 వన్డేలు ఆడిన జాకబ్ మార్టిన్ 22.57 సగటుతో 158 పరుగులు సాధించాడు. ఇక ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 138 మ్యాచ్‌లాడి 9,192 పరుగులు సాధించిన జాకబ్ మార్టిన్ 23 శతకాలు సాధించాడు. ఇక లిస్ట్-ఏ క్రికెట్లో 104 మ్యాచ్‌లాడి 2,948 పరుగులు చేశాడు.Read: భారీ నష్టాల్లో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు -
టీమిండియా మాజీ క్రికెటర్ అరెస్ట్
మద్యం మత్తులో కారు యాక్సిడెంట్ చేసిన కేసులో టీమిండియా మాజీ క్రికెటర్ జేకబ్ మార్టిన్ అరెస్ట్ అయ్యాడు. ఇవాళ (జనవరి 27) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అతను వడోదర నగరంలో మూడు వాహనాలను ఢీకొట్టాడు. యాక్సిడెంట్ జరిగిన సమయంలో జేకబ్ మద్యం తాగి ఉన్నాడని పోలీసులు గుర్తించారు.జేకబ్ తన ఎంజీ హెక్టార్ కారుతో హ్యుందాయ్ వెన్యూ, మారుతీ సిలేరియో, కియా సెల్టోస్ కార్లను ఢీకొట్టాడు. మద్యంపై ఉండటంతో నియంత్రణ కోల్పోయి యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు కేసు కట్టారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.పోలీసులు జేకబ్ను అదుపులోకి తీసుకొని, భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు మోటర్ వెహికిల్ చట్టాల కింద కేసు నమోదు చేశారు. కొద్ది గంట్లోనే జేకబ్‌కు బెయిల్ మంజూరు అయ్యింది. కానీ, కారు పోలీసుల ఆధీనంలోనే ఉంది.53 ఏళ్ల జేకబ్ మార్టిన్ 1999-2001 మధ్యలో భారత్ తరఫున 10 వన్డేలు ఆడాడు. అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా రాణించలేకపోయినా, దేశీయ క్రికెట్లో (బరోడా, రైల్వేస్, అస్సాం) అతనికి మంచి రికార్డు ఉంది. 138 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 23 శతకాల సాయంతో 9192 పరుగులు చేశాడు. లిస్ట్-ఏలోనూ 2948 పరుగులు (3 సెంచరీలు) చేశాడు. జేకబ్ బరోడా కెప్టెన్‌గా కూడా సేవలందించాడు.కుడి చేతి వాటం మిడిలార్డర్ బ్యాటర్ కమ్ ఆఫ్ స్పిన్నర్ కూడా అయిన జేకబ్ దేశవాలీ కెరీర్లో 19 వికెట్లు తీశాడు. క్రికెటర్‌గా కెరీర్ ముగిసిన తర్వాత జేకబ్ జీవితం వివాదాలు, ప్రమాదాలతో నిండిపోయింది. 2011లో అక్రమ ఇమ్మిగ్రేషన్ రాకెట్ కేసులో అతన్ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అతని ఊపిరితిత్తులు, కాలేయానికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ సమయంలో జేకబ్ కుటుంబానికి బీసీసీఐ, బరోడా క్రికెట్ అసోసియేషన్, ఐపీఎల్ ఫ్రాంచైజీలు, కృనాల్ పాండ్యా వంటి వారు ఆర్థిక సహాయం చేశారు. -
కేఎల్ రాహుల్ ఔదార్యం
న్యూఢిల్లీ: ఇటీవల ఓ టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీసీసీఐ ఆగ్రహానికి గురైన టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ మరోసారి వార్తల్లో నిలిచాడు. రాహుల్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్‌కు ఆర్థిక సాయం చేసి తనలోని ఔదార్యాన్ని చాటుకున్నాడు. ఇప్పటికే పలువురు క్రికెటర్లు, మాజీలు సైతం జాకబ్ మార్టిన్‌కు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే కృనాల్ పాండ్య ఏకంగా బ్లాంక్ చెక్కును పంపి కావాల్సినంత తీసుకోమని కోరగా, దాదాపు అదే దారిలో నడిచాడు కేఎల్ రాహుల్. తన భర్త వైద్యానికి ఎంత అవసరో అడిగి దాన్ని సాయంగా అందించి విషయాన్ని మార్టిన్ భార్య తెలిపారు. ‘ఎంత సొమ్ము కావాలంటూ రాహుల్ మమ్మల్ని అడిగారు. ఆ రోజు సాయంత్రానికే మా ఖాతాలో డబ్బు జమ చేశారు. రాహుల్ చేసింది చాలా పెద్ద సాయం’ అని మార్టిన్ భార్య ఖ్యాతి తెలిపారు. అయితే రాహుల్ ఎంత మొత్తం ఇచ్చారనే వివరాలు మాత్రం ఆమె వెల్లడించలేదు.


