కేఎల్ రాహుల్ అరుదైన ఘనత | kl rahul make a fifty on debut in ODIs, creats rare feet | Sakshi
Sakshi News home page

కేఎల్ రాహుల్ అరుదైన ఘనత

Jun 11 2016 6:45 PM | Updated on Sep 4 2017 2:15 AM

కేఎల్ రాహుల్ అరుదైన ఘనత

కేఎల్ రాహుల్ అరుదైన ఘనత

మూడు వన్డేల సిరీస్లో భాగంగా శనివారం ఇక్కడ హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జింబాబ్వేతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

హరారే: మూడు వన్డేల సిరీస్లో భాగంగా శనివారం ఇక్కడ హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జింబాబ్వేతో  తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 58 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అర్థశతకాన్నినమోదు చేసి అరంగేట్రం  వన్డే మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ సాధించిన రెండో ఓపెనర్ గా  కేఎల్ రాహులు అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతకుముందు 2006లో ఇంగ్లండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో భారత తరపున రాబిన్ ఉతప్ప ఒక్కడే ఈ ఘనతను సాధించాడు.

రాహుల్ రాణించడంతో టీమిండియా 25.0 ఓవర్లలో వికెట్ నష్టానికి 98 పరుగులు చేసింది.  అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 168 పరుగులకే పరిమితమైన సంగతి తెలిసిందే. జింబాబ్వే జట్టులో చిగుంబరా(41)మినహా ఎవరూ ఆకట్టుకోలేదు టాస్ గెలిచిన ధోని తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన జింబాబ్వేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జింబాబ్వే ఆటగాళ్లలో మూర్(3),  మసకద్జా(14) , చిబాబా(13) స్వల్ప విరామాల్లో  నిష్క్రమించడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది.

 
అనంతరం సిబందా(5), ఎర్విన్(21) మోస్తరుగా ఫర్వాలేదనిపించాడు. ఆపై చిగుంబరాకు జత కలిసిన సికిందర్ రాజా(23) జట్టు ఇన్నింగ్స్ను చక్కదిద్దే యత్నం చేశాడు. ఈ జోడీ 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో జింబాబ్వే వికెట్లకు కాసేపు బ్రేక్ పడింది. కాగా, సికిందర్ రాజా ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాక, మరోసారి జింబాబ్వే తడబడింది. అయితే చిగుంబరా తొమ్మిదో వికెట్గా వరకూ క్రీజ్ లో ఉండటంతో జింబాబ్వే సాధారణ స్కోరును నమోదు చేయగల్గింది.టీమిండియా బౌలర్లలో బూమ్రా నాలుగు వికెట్లు సాధించగా, బరిందర్ శ్రవణ్, కులకర్ణిలు తలో రెండు వికెట్లు, స్పిన్నర్లు అక్షర్ పటేల్, చాహల్లు చెరో వికెట్ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement