కివీస్, విండీస్‌  రెండో టి20 వర్షార్పణం | Kiwis and West Indies' second T20 rainfall | Sakshi
Sakshi News home page

కివీస్, విండీస్‌  రెండో టి20 వర్షార్పణం

Jan 2 2018 12:59 AM | Updated on Jan 2 2018 12:59 AM

Kiwis and West Indies' second T20 rainfall - Sakshi

మౌంట్‌ మాంగనీ: కివీస్‌ ఓపెనర్‌ మున్రో (23 బంతుల్లో 66; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు చినుకుల్లో కలిసిపోయాయి. వెస్టిండీస్‌తో సోమవారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌ వర్షంతో రద్దయింది. వర్షంతో ఆలస్యంగానే ప్రారంభమైన ఈ మ్యాచ్‌ ఎంతో సేపు సాగలేదు. మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ ఆట నిలిచే సమయానికి 9 ఓవర్లలో 4 వికెట్లకు 102 పరుగులు చేసింది. మున్రో 18 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. కాట్రెల్, బద్రీ, నర్స్, విలియమ్స్‌ తలా ఒక వికెట్‌ తీశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1–0తో ఆధిక్యంలో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement