కోల్‌కతాదే బ్యాటింగ్‌ | Kings Punjab Won The toss And Choose To Field Against KKR | Sakshi
Sakshi News home page

Apr 21 2018 3:49 PM | Updated on Apr 21 2018 4:03 PM

Kings Punjab Won The toss And Choose To Field Against KKR - Sakshi

కోల్‌కతా : ఐపీఎల్‌-11 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌పంజాబ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన పంజాబ్‌ కెప్టెన్‌ అశ్విన్‌ ఫీల్డింగ్‌ వైపే మొగ్గు చూపాడు. ఈ మైదాన వికెట్‌ చేజింగ్‌ అనుకూలంగా ఉంటందని ఇరు జట్ల కెప్టెన్లు అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌కు ఎలాంటి మార్పులు లేకుండా కోల్‌కతా బరిలోకి దిగుతుండగా.. పంజాబ్‌ జట్టులో స్పల్ప మార్పు చోటు చేసుకుంది.

మోహిత్‌శర్మ స్థానంలో అంకిత్‌శర్మ తుదిజట్టులోకి వచ్చాడు. ఇక కోల్‌కతా 5 మ్యాచుల్లో మూడు గెలిచి రెండు ఓడగా.. పంజాబ్‌ నాలుగింటిలో మూడు నెగ్గింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. క్రిస్‌గేల్‌ భీకర ఫామ్‌లో ఉండటం పంజాబ్‌కు అదనపు బలం కాగా.. సొంత మైదానంలో ఆడటం కోల్‌కతాకు కలిసొచ్చే అంశం.

తుది జట్లు
కోల్‌కతా: సునీల్‌ నరైన్‌, క్రిస్‌లిన్‌, ఉతప్ప, రానా, దినేశ్‌ కార్తీక్‌ (కెప్టెన్‌), రస్సెల్‌, శుభమన్‌ గిల్‌, కుర్రాన్‌, చావ్లా, శివం మావి, కుల్దీప్‌ యాదవ్‌
కింగ్స్‌ పంజాబ్‌: కేఎల్‌ రాహుల్‌, క్రిస్‌ గేల్‌, అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌, ఆరోన్‌ ఫించ్‌, యువరాజ్‌ సింగ్‌, ఆర్‌ అశ్విన్(కెప్టెన్‌)‌, ఆండ్రూ టై, మూజీబ్‌, రాజ్‌పూత్‌, బీబీశ్రన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement