కిమ్‌ జాంగ్‌ చిందులు!

Kim Jong Un impersonator walked through North Korea's Olympic - Sakshi

వేసింది ఆయన కాదు డూప్‌  

ప్యాంగ్‌చాంగ్‌: కిమ్‌ జాంగ్‌ అంటే తెలియని వారు తక్కువే. ఉత్తర కొరియా నియంత మరి ఆయనేంటి? ఈ చిందులేంటని ఆశ్చర్యపోకండి. కాస్త ఈ వివరాల్లోకి వెళ్లండి... నిత్యనూతన క్షిపణి పరీక్షలతో ఎప్పుడు వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌. అగ్రరాజ్యం అమెరికాకు కొరకరాని కొయ్య. తాజాగా దక్షిణ కొరియాలో జరుగుతున్న వింటర్‌ ఒలింపిక్స్‌లో అచ్చు కిమ్‌ జాంగ్‌ను పోలిన వ్యక్తి కనువిందు చేశారు. తమ కొరియా చీర్‌ లీడర్ల బృందం ముందు డ్యాన్స్‌ చేశారు. నలుపు సూటు, బూటులో నల్లని కళ్లజోడు ధరించి సాక్షాత్తు కిమ్‌నే తలపించిన ఆయన ఉన్నపళంగా ఉమ్మడి కొరియా, జపాన్‌ జట్ల మధ్య ఐస్‌ హాకీ మ్యాచ్‌ జరుగుతుండగా వచ్చి చిందులేసి ఆశ్చర్యపరిచారు.

వెంటనే అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది ఆయన్ని అదుపులోకి తీసుకుంది. ఆయన పేరు హోవర్డ్‌. నిజానికి కిమ్‌లా ఉన్న హోవర్డ్, ట్రంప్‌ను అచ్చుగుద్దినట్లు ఉండే డెనిస్‌ అలన్‌ ఇద్దరు కలిసి స్టేడియంలోని ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచాలనుకున్నట్లు కిమ్‌ డూపు... హోవర్డ్‌ తెలిపారు. పోలీసులు తనను అరెస్టు చేయలేదని కేవలం బయటికి లాక్కెళ్లినట్లు చెప్పారు. అయితే ఈ తతంగం జరుగుతుండగా వీఐపీ గ్యాలరీలో కిమ్‌ సొంత చెల్లి కిమ్‌ యో జాంగ్, అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ ఉన్నారు.   

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top