ఆ ఇద్దరిలో సూపర్‌ స్టార్‌ ఎవరంటే..! | Kedar Jadhav's Favourite Superstar, Salman Khan Or MS Dhoni | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరిలో సూపర్‌ స్టార్‌ ఎవరంటే..!

Apr 17 2020 2:13 PM | Updated on Apr 17 2020 2:14 PM

Kedar Jadhav's Favourite Superstar, Salman Khan Or MS Dhoni - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌లు అంటే తనకు ఎంతో ఇష్టమని టీమిండియా క్రికెటర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ కేదార్‌ జాదవ్‌ పేర్కొన్నాడు. వారిద్దరిలో తన సూపర్‌ స్టార్‌ ఎవరంటే చెప్పడం కష్టమన్నాడు. కాగా, ఆ ఇద్దరిలో ఎంచుకోమంటే మాత్రం అది చాలా కష్టమన్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పలు అంశాలపై మాట్లాడిన జాదవ్‌.. ధోని-సల్మాన్‌ ఖాన్‌లలో మీ ఫేవరెట్‌ సూపర్‌ స్టార్‌ అనే ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పాడు. ‘ నా దృష్టిలో వారిద్దరూ సూపర్‌ స్టార్సే. నేను భారత్‌కు ఆడుతున్నప్పుడు ధోని భాయ్‌ ద్వారా సల్మాన్‌ను కలిశాను. (నీలాగ దేశాన్ని అమ్మేయలేదు..!)

ఇద్దరూ సూపర్‌ స్టార్సే. వీరిలో ఒకర్ని ఎంచుకోవడం నాకు చాలా కష్టం. మీకు నాన్న ఇష్టమా.. అమ్మ ఇష్టమా అంటే ఏం చెబుతాం. మన దగ్గర సమాధానమే ఉండదు. అలాగే ధోని-సల్మాన్‌లలో ఎవరు ఇష్టం అంటే చెప్పడం నా వల్ల కాదు’ అని కేదార్‌ జాదవ్‌ పేర్కొన్నాడు.  ‘తాను తొలిసారి ధోనిని కలిసినప్పుడు అతను టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాడు. చాలా కచ్చితత్వంతో ఉన్నాడు. అదే సమయంలో చాలా కామ్‌గా ఉంటూ తనపని తాను చేసుకుపోతాడు. అది నాపై చాలా ప్రభావం చూపింది. నేను రిలాక్స్‌గా క్రికెట్‌ను ఆడటానికి ధోనినే కారణం. క్రికెటర్ల విషయానికి కొస్తే నా ఫేవరెట్‌ క్రికెటర్‌ ధోనినే’ అని చెప్పుకొచ్చాడు. ఇక సచిన్‌ టెండూల్కర్‌ గురించి జాదవ్‌ మాట్లాడుతూ.. దేశంలో 99 శాతం మంది క్రికెట్‌ అభిమానులు సచిన్‌ ఆటను ఎంతగానో ఆస్వాదిస్తారు. అందులో నేను కూడా ఒకడ్ని. కానీ నేను సచిన్‌తో ఆడలేకపోయాను’ అని జాదవ్‌ తెలిపాడు.(‘ఈ ఏడాది వరల్డ్‌కప్‌ కష్టమే’)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement