రాణించిన రాయుడు, జాదవ్ | Kedar Jadhav, Ambati Rayudu lift India A to win | Sakshi
Sakshi News home page

రాణించిన రాయుడు, జాదవ్

Jul 31 2014 7:14 PM | Updated on May 25 2018 7:45 PM

రాణించిన రాయుడు, జాదవ్ - Sakshi

రాణించిన రాయుడు, జాదవ్

తెలుగు కుర్రాడు అంబటి రాయుడు, కేదార్ జాదవ్ అర్థ సెంచరీలు సాధించడంతో నాలుగు దేశాల సిరీస్‌లో భారత్-ఎ ఐదో విజయాన్ని నమోదు చేసింది.

డార్విన్: తెలుగు కుర్రాడు అంబటి రాయుడు, కేదార్ జాదవ్ అర్థ సెంచరీలు సాధించడంతో నాలుగు దేశాల సిరీస్‌లో భారత్-ఎ ఐదో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా-ఎ జట్టును భారత్ 5 వికెట్ల తేడాతో ఓడించింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. భారత్ బౌలర్ మనోజ్ కుమార్ తివారి 5 వికెట్లు పడగొట్టాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ 47.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. రాయుడు 77, జాదవ్ 42, శామ్సన్ 49, పర్వేజ్ రసూల్ 20, ఊతప్ప 13 పరుగులు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement