
కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరిగిన తొలి అనాధికారిక వన్డేలో 171 పరుగుల తేడాతో భారత్-ఎ జట్టు ఘన విజయం సాధించింది. 414 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి ఆసీస్ జట్టు 33.1 ఓవర్లలో కేవలం 242 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ నిశాంత్ సింధూ 4 వికెట్లు పడగొట్టి కంగారుల పతనాన్ని శాసించాడు.
అతడితో పాటు రవి బిష్ణోయ్ రెండు, సిమ్రాన్‌జీత్ సింగ్, యుద్ద్‌వీర్ సింగ్, అయూష్ బదోని తలా వికెట్ సాధించారు. ఆసీస్ బ్యాటర్లలో మెకెంజీ హార్వే(68) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సదర్లాండ్(50), లాచ్లాన్ షా(45) పర్వాలేదన్పించారు.అయ్యర్, ఆర్య సెంచరీలు..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 413 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్( 83 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110 పరుగులు), ప్రియాన్ష్ ఆర్య( 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) సూపర్ సెంచరీలతో చెలరేగారు.
వీరిద్దరితో పాటు ప్రభ్ సిమ్రాన్ సింగ్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), రియాన్ పరాగ్(42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67), బదోని(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. సీస్ బౌలర్లలో విల్ సదర్లాండ్ రెండు, సంఘా, ముర్ఫీ, స్కాట్, స్టార్కర్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆక్టోబర్ 3న కాన్పూర్ వేదికగానే జరగనుంది.
చదవండి: ILT20: అశ్విన్‌కు ఘోర అవమానం.. అస్సలు ఊహించి ఉండడు