కుర్రాళ్లూ అదుర్స్ | Junior hockey tournament | Sakshi
Sakshi News home page

కుర్రాళ్లూ అదుర్స్

Oct 31 2016 11:48 PM | Updated on Sep 4 2017 6:48 PM

నాలుగు దేశాల అంతర్జాతీయ జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో భారత కుర్రాళ్లు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచారు.

వాలెన్సియా: నాలుగు దేశాల అంతర్జాతీయ జూనియర్ హాకీ టోర్నమెంట్‌లో భారత కుర్రాళ్లు అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత యువ జట్టు 5-2 తేడాతో జర్మనీపై ఘనవిజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచే విరుచుకుపడిన భారత్‌కు 10వ నిమిషంలో పర్వీందర్ సింగ్, 22వ నిమిషంలో అర్మాన్ ఖురేషి గోల్స్ అందించారు.

ప్రత్యర్థి నుంచి పెద్దగా పోటీ ఎదురుకాకపోవడంతో 40వ నిమిషంలో గుర్జాంత్ సింగ్, 44వ నిమిషంలో వరుణ్ కుమార్ చేసిన గోల్స్‌తో భారత్ 4-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. అరుుతే 46, 65వ నిమిషాల్లో జర్మనీకి రెండు గోల్స్ లభించారుు. ఇక 69వ నిమిషంలో ఆనంద్ లక్రా భారత్‌కు ఐదో గోల్ అందించి విజయాన్ని ఖాయం చేశాడు. జట్టు ఆటగాళ్లకు హాకీ ఇండియా లక్ష చొప్పున నజరానా ప్రకటించింది. వ్యక్తిగత ప్రదర్శనకు హర్మన్‌ప్రీత్, వరుణ్ కుమార్‌లకు మరో లక్ష చొప్పున అదనంగా ఇవ్వనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement