'ఇండియా' కోసం దక్షిణాఫ్రికా క్రికెటర్‌ పూజలు! | Jonty Rhodes Performs Puja For India | Sakshi
Sakshi News home page

'ఇండియా' కోసం దక్షిణాఫ్రికా క్రికెటర్‌ పూజలు!

May 2 2016 5:41 PM | Updated on Sep 3 2017 11:16 PM

దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్‌కు భారత్‌ అంటే చాలా ప్రేమ.

దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్‌కు భారత్‌ అంటే చాలా ప్రేమ. ఉన్నతమైన భారత ఆచార సంప్రదాయాలను ఆయన అమితంగా ప్రేమిస్తారు. దేశంలోని ఆలయాలకు వెళ్లి.. ఆధ్మాత్మిక భావనతో తన్మయత్వం చెందుతారు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఫీల్డింగ్‌ కోచ్‌గా ఉన్న ఈ మాజీ ఆల్‌ రౌండర్‌లో ప్రస్తుతం కుటుంబసభ్యులతో కలిసి ముంబైలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ముంబైలోని పేజావర్‌ మఠాన్ని సందర్శించి.. 'ఇండియా' కోసం ప్రత్యేక పూజలు చేయించారు. హిందూ సంప్రదాయ దుస్తులైన ధోతీ, శాలువ ధరించి  ఆయన 'ఇండియా' ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ప్రత్యేక హోమాలు, యజ్ఞాలు చేయించారు. ఆ ఫొటోలను తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ పేజీల్లో పోస్టు చేశారు.

ఇంతకు 'ఇండియా' కోసం ఆయన పూజలు ఎందుకు చేయించారంటే.. 'ఇండియా' ఆయన కూతురి పేరు. భారత్‌పై ఉన్న మక్కువ, ఉన్నతమైన భారత సంప్రదాయ, ఆచారాలపై ఇష్టంతో ఆయన తన బిడ్డకు 'ఇండియా' అని పేరు పెట్టారు. ఆమె బాగు కోసం ఇటీవల పూజలు చేయించారు. ఇటీవల ఆయన కుటుంబసభ్యులతో తమిళనాడులోని అన్నామలై ఆలయాన్ని కూడా సందర్శించారు.  


 

Advertisement
 
Advertisement
Advertisement