ఇటలీకి ఐర్లాండ్ షాక్ | Italy, Ireland shock | Sakshi
Sakshi News home page

ఇటలీకి ఐర్లాండ్ షాక్

Jun 24 2016 12:54 AM | Updated on Sep 4 2017 3:13 AM

ఇటలీకి ఐర్లాండ్ షాక్

ఇటలీకి ఐర్లాండ్ షాక్

వరుస విజయాలతో ఊపుమీదున్న ఇటలీ జట్టుకు.. యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో ఐర్లాండ్ షాకిచ్చింది.

►  ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశం
ఇటలీ, బెల్జియం కూడా ముందుకు యూరో కప్

 
లిల్లీ (ఫ్రాన్స్): వరుస విజయాలతో ఊపుమీదున్న ఇటలీ జట్టుకు.. యూరోపియన్ చాంపియన్‌షిప్‌లో ఐర్లాండ్ షాకిచ్చింది. మ్యాచ్ ఆసాంతం ఇటలీ దాడులను అడ్డుకోవడమే కాకుండా ఆఖరి నిమిషాల్లో సంచలన గోల్‌తో ప్రత్యర్థిని కంగుతినిపించింది. ఫలితంగా బుధవారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్-ఇ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఐర్లాండ్ 1-0తో ఇటలీపై గెలిచి ప్రిక్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఈ గ్రూప్‌లో చెరో ఆరు పాయింట్లతో ఇటలీ, బెల్జియం కూడా నాకౌట్ దశకు చేరుకున్నాయి. ఐర్లాండ్ తరఫున రాబీ బ్రాడీ (85వ ని.) ఏకైక గోల్ సాధించాడు.

బెల్జియం గెలుపు: మరో మ్యాచ్‌లో బెల్జియం 1-0తో స్వీడన్‌పై గెలిచింది. నైనంగోలన్ (84వ ని.) బెల్జియం తరఫున ఏకైక గోల్ చేశాడు. స్వీడన్ స్టార్ స్ట్రయికర్ ఇబ్రమోవిచ్ కెరీర్‌లో తన చివరి మ్యాచ్ ఆడేశాడు. యూరో తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు మంగళవారమే ప్రకటించిన అతను ఈసారి గోల్ చేయలేకపోయాడు.

Advertisement
 
Advertisement
Advertisement