ఐపీఎల్‌ను ఎన్ని వివాదాలు చుట్టుముడుతున్నా... ఆదరణ మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. టోర్నీ ప్రారంభం నుంచి పూర్తయ్యేదాకా ఐపీఎల్ పట్ల అభిమానులు అత్యంత ఆసక్తి కనబరుస్తుంటారు.
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ను ఎన్ని వివాదాలు చుట్టుముడుతున్నా... ఆదరణ మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. టోర్నీ ప్రారంభం నుంచి పూర్తయ్యేదాకా ఐపీఎల్ పట్ల అభిమానులు అత్యంత ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఈసారి ఆటగాళ్ల వేలంతోనే అది తారస్థాయికి చేరింది. ఐపీఎల్-7 కోసం ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించిన ఆటగాళ్ల వేలాన్ని స్టార్‌స్పోర్ట్స్ డాట్‌కామ్ వెబ్‌సైట్ ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించగా రికార్డు స్థాయిలో 6.8 లక్షల హిట్లు నమోదయ్యాయి. గత ఏడాది సోనీ సిక్స్ ద్వారా వేలాన్ని 4.04 లక్షల మంది వీక్షించగా, 25 నిమిషాల సగటు నమోదైంది. కాగా, ఈసారి ఒక్కొక్కరు 31 నిమిషాలు వెబ్ ద్వారా వేలాన్ని వీక్షించారు. యువరాజ్, పీటర్సన్ వంటి స్టార్ ఆటగాళ్లను వేలం వేసిన సమయంలో వీక్షకుల సంఖ్య ఎక్కువగా నమోదైనట్లు స్టార్‌స్పోర్ట్స్ తెలిపింది.