ఆటగాళ్ల గాయాలు దెబ్బతీశాయి: మ్యాథ్యూస్ | Injuries, fielding hurt Lanka's chances in World Cup: Angelo Mathews | Sakshi
Sakshi News home page

ఆటగాళ్ల గాయాలు దెబ్బతీశాయి: మ్యాథ్యూస్

Mar 28 2015 12:12 AM | Updated on Sep 2 2017 11:28 PM

ఫీల్డింగ్ వైఫల్యానికి తోడు గాయాలతో ఆటగాళ్లు దూరం కావడం ప్రపంచకప్‌లో శ్రీలంక అవకాశాలను దెబ్బతీసిందని కెప్టెన్ ఏంజెలో మ్యాథ్యూస్ అన్నాడు.

కొలంబో: ఫీల్డింగ్ వైఫల్యానికి తోడు గాయాలతో ఆటగాళ్లు దూరం కావడం ప్రపంచకప్‌లో శ్రీలంక అవకాశాలను దెబ్బతీసిందని కెప్టెన్ ఏంజెలో మ్యాథ్యూస్ అన్నాడు. ‘మా ఫీల్డింగ్ ప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయి. అలాగే టోర్నీ కోసం ముందుగా ప్రకటించిన 15 మంది జాబితాలో ఐదుగురు ఆటగాళ్లు గాయాల కారణంగా తప్పుకున్నారు.

ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన క్వార్టర్స్‌లో ఆఫ్ స్పిన్నర్ కుశాల్ పెరీరాను ఆడించడంలో మేం ఎలాంటి పొరపాటు చేయలేదు. ఎందుకంటే అతడికదే తొలి వన్డే. ప్రత్యర్థికి అతడి బౌలింగ్ తీరు తెలీదు కాబట్టి ప్రయోగం చేశాం’ అని మ్యాథ్యూస్ చెప్పుకొచ్చాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement