రింగ్ లో కుప్పకూలి..ఆస్పత్రిలో బాక్సర్ మృతి | Injured Sydney boxer taken off life support, dies | Sakshi
Sakshi News home page

రింగ్ లో కుప్పకూలి..ఆస్పత్రిలో బాక్సర్ మృతి

Sep 15 2015 4:49 PM | Updated on Sep 28 2018 3:41 PM

రింగ్ లో కుప్పకూలి..ఆస్పత్రిలో బాక్సర్ మృతి - Sakshi

రింగ్ లో కుప్పకూలి..ఆస్పత్రిలో బాక్సర్ మృతి

బాక్సింగ్ రింగ్ లో తీవ్రంగా గాయపడిన సిడ్నీ బాక్సర్ డేవిడ్ బ్రౌన్ జూనియర్ (28) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

కాన్ బెర్రా: బాక్సింగ్ రింగ్ లో తీవ్రంగా గాయపడిన సిడ్నీ బాక్సర్ డేవిడ్ బ్రౌన్ జూనియర్ (28) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. న్యూసౌత్ వేల్స్ లోని జరిగిన బాక్సింగ్ పోరులో ప్రత్యర్థి దాటికి బ్రౌన్ కుప్పుకూలిపోయాడు. ఆ తరువాత కాసేపటికి స్పృహలోకి వచ్చిన బ్రౌన్ ను ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించారు.  అయితే తీవ్ర గాయాల పాలైన బ్రౌన్ ను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

 

ఇటీవల రీజనల్ పోరులో భాగంగా న్యూసౌత్ వేల్స్ బాక్సింగ్ ఫైట్ జరిగింది.  కాగా, 12 రౌండ్ల పోరు మరో 30 నిమిషాల్లో ముగుస్తుందనగా ప్రత్యర్థి ఇచ్చిన ముష్టి ఘాతంతో ఒక్కసారిగా కిందిపడిపోయిన బ్రౌన్ కోమాలోకి జారుకున్నాడు. ఆపై ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న అతని బాధ చూడలేని కుటుంబ సభ్యులు చికిత్స ఆపేయాల్సిందిగా డాక్టర్లను కోరారు. బాక్సర్ మృతిపట్ల న్యూసౌత్ వేల్స్ మంత్రి స్టువర్ట్ ఎయిర్స్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement