భారత మహిళలదే హాకీ సిరీస్‌ | Indian women's win a hockey series | Sakshi
Sakshi News home page

భారత మహిళలదే హాకీ సిరీస్‌

Mar 6 2017 12:27 AM | Updated on Sep 5 2017 5:17 AM

వరుసగా మూడో విజయం సాధించిన భారత మహిళల హాకీ జట్టు బెలారస్‌తో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3–0తో

భోపాల్‌: వరుసగా మూడో విజయం సాధించిన భారత మహిళల హాకీ జట్టు బెలారస్‌తో జరుగుతోన్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో టీమిండియా 3–1తో గెలిచింది.

రైటా బటురా 24వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి బెలారస్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించింది. అయితే భారత కెప్టెన్‌ రాణి రాంపాల్‌ 35వ, 39వ నిమిషాల్లో ఫీల్డ్‌ గోల్స్‌ చేసింది. దీంతో భారత్‌ 2–1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 42వ నిమిషంలో దీపిక మరో గోల్‌ చేసి భారత విజయాన్ని ఖాయం చేసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement