
భారత మహిళల ఘనవిజయం
ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు ఘనంగా ఆరంభించింది.
చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్
ఆసియా కప్ టి20 టోర్నీ
బ్యాంకాక్: ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు ఘనంగా ఆరంభించింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 118 పరుగులు చేసింది. సీనియర్ బ్యాట్స్‌వుమన్ మిథాలీ రాజ్ (59 బంతుల్లో 49 నాటౌట్; 2 ఫోర్లు), స్మృతి మంధన (32 బంతుల్లో 41; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు.
ఖదీజాకు రెండు వికెట్లు దక్కారుు. బంగ్లాదేశ్ జట్టు 18.2 ఓవర్లలో కేవలం 54 పరుగులకే ఆలౌట్ అరుు్యంది. నాలుగు పరుగుల వ్యవధిలో చివరి ఐదు వికెట్లను కోల్పోరుుంది. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ మూడు వికెట్లు తీయగా జులన్ గోస్వామి, అనూజ పాటిల్‌లకు రెండేసి వికెట్లు దక్కారుు. మరో మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు నేపాల్‌పై 9 వికెట్ల తేడాతో నెగ్గింది.