వెస్టిండీస్తో వచ్చే నెల్లో జరిగే రెండు టెస్టుల సిరీస్కు ఈ నెల 29న భారత జట్టును ప్రకటించనున్నారు.
వెస్టిండీస్తో వచ్చే నెల్లో జరిగే రెండు టెస్టుల సిరీస్కు ఈ నెల 29న భారత జట్టును ప్రకటించనున్నారు. ఆస్ట్రేలియాతో ఆరో వన్డేకు ముందు రోజు సందీప్ పాటిల్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ సమావేశమై జట్టును ఎంపిక చేయనున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
విండీస్,భారత్ టెస్టు వేదికలుగా కోల్కతా, ముంబైలను ఇప్పటికే ఎంపిక చేశారు. తొలి టెస్టు నవంబర్ 6-10, రెండో టెస్టు 14-18 మధ్య జరగనున్నాయి. ముంబైలో జరిగే రెండో మ్యాచ్లో చరిత్రాత్మక 200వ టెస్టు ఆడిన తర్వాత భారత బ్యాటింగ్ గ్రేట్ సచిన్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సిరీస్పై అభిమానుల్లో ఆసక్తి ఏర్పడింది.