స్వర్ణం నెగ్గిన షూటర్‌ ఇలవేనిల్‌  | indian shooter ilanivel win a gold meda | Sakshi
Sakshi News home page

స్వర్ణం నెగ్గిన షూటర్‌ ఇలవేనిల్‌ 

Jun 26 2018 1:36 AM | Updated on Jun 26 2018 1:36 AM

indian shooter ilanivel win a gold meda - Sakshi

జూనియర్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత యువ షూటర్‌ ఇలవేనిల్‌ వలారివాన్‌ స్వర్ణ పతకం సాధించింది. జర్మనీలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఆమె 251.7 పాయింట్లు స్కోరు చేసింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌కిది మూడో స్వర్ణం కావడం విశేషం. క్వాలిఫయింగ్‌లో ఇలవేనిల్‌ 630.5 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. భారత్‌కే చెందిన మెహులీ ఘోష్‌ ఫైనల్‌ చేరినా ఆమె ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement