కోహ్లి ‘డబుల్‌ సెంచరీ’ల రికార్డులు

India Vs South Africa Virat Kohli Notched Records In 2nd Test In Pune - Sakshi

పుణె : దక్షిణాఫ్రికాతో మహారాష్ట్ర క్రికెట్‌ అసోషియేషన్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (254 నాటౌట్‌) పరుగుల వరద పారించాడు. అతనికి తోడు మయాంక్‌ అగర్వాల్‌ 108, చతేశ్వర్‌ పుజారా 58, అజింక్య రహానే 59, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా 91 పరుగులు సాధించారు. దీంతో 601 పరుగుల భారీ స్కోరు వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఈ క్రమంలో కెప్టెన్‌ కోహ్లి పలు రికార్డులను అధిగమించాడు. టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో కెప్టెన్‌గా అత్యధిక డబుల్‌ సెంచరీలు (7) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఓవరాల్‌గా 7 డబుల్‌ సెంచరీలు సాధించిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు. కోహ్లి కంటే ముందు లెజెండ్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ (12), కుమార సంగక్కర (11), బ్రియన్‌ లారా (9) ఉన్నారు. వీరేంద్ర సెహ్వాగ్‌ (6), సచిన్‌ (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
(చదవండి : కోహ్లి డబుల్‌, ఉమేష్‌ దెబ్బకు ఢమాల్‌..!)

ఇక టీమిండియా కెప్టెన్‌గా 19 టెస్టు సెంచరీలు సాధించిన రికార్డును కోహ్లి తన పేర లిఖించుకున్నాడు. దీంతో పాటు తక్కువ ఇన్నింగ్స్‌లలో 7 వేల పరుగులు సాధించిన జాబితాలో గ్యారీ సోబర్స్‌, కుమార సంగక్కరతో కలిసి కోహ్లి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ ముగ్గురూ 138 ఇన్నింగ్స్‌లలో 7 పరుగులు సాధించారు. ఇక వాలీ హామండ్‌ (131 ఇన్నింగ్స్‌లు), వీరేంద్ర సెహ్వాగ్‌ (134 ఇన్నింగ్స్‌లు), సచిన్‌ టెండూల్కర్‌ (136 ఇన్నింగ్స్‌లు) కోహ్లి కంటే ముందున్నారు. ఇదిలాఉండగా.. పుణె టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగుల మార్క్‌ను చేరుకున్న కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 150 పైచిలుకు పరుగులు సాధించిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. అతనికంటే ముందుగా డాన్‌ బ్రాడ్‌మన్‌ 8 సార్లు 150 పైగా పరుగులు సాధించాడు. కెప్టెన్‌గా 19 సెంచరీలు సాధించిన కోహ్లి.. ఆ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌తో సమానంగా నిలిచాడు.
(చదవండి : నోరు పారేసుకున్న రబడ.. సర్దిచెప్పిన కెప్టెన్‌..!)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top