టీమిండియాకు రెండో ర్యాంకు | India in second spot in Tests after beating South Africa 3-0 | Sakshi
Sakshi News home page

టీమిండియాకు రెండో ర్యాంకు

Dec 7 2015 4:24 PM | Updated on Sep 3 2017 1:38 PM

టీమిండియాకు రెండో ర్యాంకు

టీమిండియాకు రెండో ర్యాంకు

దక్షిణాఫ్రికాపై 3-0 తేడాతో సిరీస్ ను గెలిచిన టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి ఎగబాకింది.

దుబాయ్: దక్షిణాఫ్రికాపై 3-0 తేడాతో సిరీస్ ను గెలిచిన టీమిండియా టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో స్థానానికి ఎగబాకింది. నాల్గో టెస్టులో విజయంతో  విరాట్ సేన టెస్టు ర్యాంకింగ్స్ లో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని ఆసీస్ ను వెనక్కునెట్టింది. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా 110 పాయింట్లతో రెండో స్థానం సాధించగా, ఆసీస్ 109 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయింది.  అయితే టీమిండియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను  దక్షిణాఫ్రికా కోల్పోయినా  ర్యాంకింగ్స్ లో మాత్రం ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. దక్షిణాఫ్రికా 114 పాయింట్లతో మాత్రం తొలి స్థానంలో కొనసాగుతోంది.

 

ఇదిలా ఉండగా పాకిస్థాన్ (106 పాయింట్లు), ఇంగ్లండ్(99 పాయింట్లు) ఐదో స్థానంలో ఉన్నాయి. ఆ తదుపరి వరుస స్థానాల్లో న్యూజిలాండ్ (95 పాయింట్లు) , శ్రీలంక(93 పాయింట్లు) , వెస్టిండీస్(76 పాయింట్లు), బంగ్లాదేశ్(47 పాయింట్లు), జింబాబ్వే(5 పాయింట్లు) లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement