సెమీస్ లో భారత్ | India enter semis of women's Junior Asia Cup | Sakshi
Sakshi News home page

సెమీస్ లో భారత్

Sep 10 2015 7:40 PM | Updated on Sep 3 2017 9:08 AM

సెమీస్ లో భారత్

సెమీస్ లో భారత్

కెప్టెన్ రాణీ రాంపాల్ హ్యాట్రిక్ తో రాణించడంతో... ఇక్కడ జరుగుతున్న ఉమెస్స్ జూనియర్ ఆసియా కప్ లో భారత్ సెమీస్ లోకి అడుగు పెట్టింది. ఇవాళ మలేషియాతో జరిగిన నిర్ణాయక మ్యాచ్ లో భారత్ 9-1 తేడాతో విజయం సాధించింది.

కెప్టెన్ రాణీ రాంపాల్ హ్యాట్రిక్ తో రాణించడంతో... ఇక్కడ జరుగుతున్న ఉమెస్స్ జూనియర్ ఆసియా కప్ లో భారత్ సెమీస్ లోకి అడుగు పెట్టింది. ఇవాళ మలేషియాతో జరిగిన నిర్ణాయక మ్యాచ్ లో భారత్ 9-1 తేడాతో విజయం సాధించింది. సెమీస్ చేరాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బారత్ దూకుడుగా ఆడింది. ఆట ప్రారంభమైన ఎనిమిదో నిమిషంలోనే చక్కటి ఫీల్డ్ గోల్ తో రాణీ కౌంట్ స్టార్ట్ చేసింది. తర్వాత 15వ నిమిషంలో జస్ ప్రీత్ కౌర్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి లీడ్ రెండుకు పెంచింది. హాఫ్ టైమ్ కి ఆరునిమిషాల ముందు ప్రీతీ దూబే గోల్ తో లీడ్ మూడుకు పెరిగింది. హాఫ్ టైమ్ కు కాస్త ముందు భారత డిఫెన్స్ ను దాటుకుని మలేషియ గోల్ చేయగలిగింది.

సెకండ్ హాఫ్ లో భారత్ మహిళలు రెచ్చిపోయారు. ఆరు నిమిషాల వ్యవధిలో నాలుగు గోల్స్ చేశారు. ఆట 51 నిమిషంలో పూనమ్ బల్రా ఫీల్డ్ గోల్ చేయగా.. జస్ ప్రీత్ మరో పెనాల్టీ కార్నర్ గోల్ గా మలిచింది. దీంతో మలేసియా పై భారీ విజయాన్ని నమోదు చేశారు. ఆదివారం సెమీ ఫైనల్  మ్యాచ్ జరగ నుంది. ఈ టోర్నీ వచ్చే ఏడాది జరగ నున్న ఎఫ్ఐహెచ్ జూనియర్ ప్రపంచ కప్ కు క్వాలిఫైయ్యింగ్ టోర్నీ కావడం విశేషం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement