మహిళల హాకీ వరల్డ్‌ లీగ్‌ ఫైనల్లో భారత్‌ | India enter final of Women's Hockey World League Round 2 | Sakshi
Sakshi News home page

మహిళల హాకీ వరల్డ్‌ లీగ్‌ ఫైనల్లో భారత్‌

Apr 10 2017 2:40 AM | Updated on Sep 5 2017 8:22 AM

మహిళల హాకీ వరల్డ్‌ లీగ్‌ ఫైనల్లో భారత్‌

మహిళల హాకీ వరల్డ్‌ లీగ్‌ ఫైనల్లో భారత్‌

హాకీ వరల్డ్‌ లీగ్‌ (హెచ్‌డబ్ల్యూఎల్‌) రౌండ్‌–2లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది.

వెస్ట్‌ వాంకోవర్‌ (కెనడా): హాకీ వరల్డ్‌ లీగ్‌ (హెచ్‌డబ్ల్యూఎల్‌) రౌండ్‌–2లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెమీఫైనల్లో భారత్‌ 4–0 గోల్స్‌తో బెలారస్‌పై ఘనవిజయం సాధించింది.

భారత్‌ తరఫున గుర్జిత్‌ కౌర్‌ (13వ, ని. 58వ ని.), కెప్టెన్‌ రాణి రాంపాల్‌ (20వ ని. 40వ ని.) రెండేసి గోల్స్‌ చేశారు. మరో సెమీస్‌లో ఉరుగ్వేపై 2–1తో గెలిచిన చిలీతో భారత్‌ అమీతుమీ తేల్చుకుంటుంది. తాజా సెమీస్‌ విజయంతో భారత జట్టు హెచ్‌డబ్ల్యూఎల్‌ సెమీఫైనల్‌ ఈవెంట్‌కు అర్హత సంపాదించింది. ఎఫ్‌ఐహెచ్‌ మహిళల ప్రపంచకప్‌ (2018)కు క్వాలిఫయింగ్‌ టోర్నీ అయిన ఆ ఈవెంట్‌ ఈ ఏడాది జూన్‌ 21 నుంచి బెల్జియంలో జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement