బాక్సింగ్‌ డే టెస్ట్‌ : విజయం దిశగా భారత్‌ | India Eight Wickets Away From Third Test Win Over Australia  | Sakshi
Sakshi News home page

Dec 29 2018 7:52 AM | Updated on Dec 29 2018 7:53 AM

India Eight Wickets Away From Third Test Win Over Australia  - Sakshi

ఆసీస్‌కు 399 పరుగుల భారీ లక్ష్యం..

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో భారత్‌ విజయం దిశగా దూసుకెళ్తుంది. 54/5 ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో నాల్గో రోజు ఆటను ప్రారంభించిన కోహ్లిసేన మరో 52 పరుగుల జోడించి 106/8 వద్ద డిక్లేర్డ్‌ చేసింది. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (42), రిషభ్‌ పంత్‌లు ఆరో వికెట్‌కు 39 పరుగులు జోడించగా.. రవీంద్ర జడేజా (5) పరుగులు చేశాడు. దీంతో ఆసీస్‌కు 399 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. అనంతరం సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆతిథ్య జట్టు ఆదిలోనే ఓపెనర్లు అరోన్‌ ఫించ్‌ (3), మార్కస్‌ హర్రీస్‌ (13)ల వికెట్లు కోల్పోయింది. ఫించ్‌ను జడేజా ఔట్‌ చేయగా.. హర్రీస్‌ను బుమ్రా పెవిలియన్‌కు చేర్చాడు. ప్రస్తుతం క్రీజులో ఉస్మాన్‌ ఖాజా (26), షాన్‌ మార్ష్‌(2)లు ఆడుతున్నారు. పిచ్‌ పూర్తిగా బౌలింగ్‌కు సహకరిస్తున్న నేపథ్యంలో భారత్‌ విజయం లాంఛనం కానుంది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 443/7 డిక్లేర్డ్‌, రెండో ఇన్నింగ్స్‌ 106/8 డిక్లేర్డ్‌
ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 151 ఆలౌట్‌, రెండో ఇన్నింగ్స్‌ 44/2

Advertisement
 
Advertisement
Advertisement