భారత్ క్లీన్‌స్వీప్ | India clean sweep | Sakshi
Sakshi News home page

భారత్ క్లీన్‌స్వీప్

Aug 6 2015 2:06 AM | Updated on Sep 3 2017 6:50 AM

యూరోప్ పర్యటనలో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు ఫ్రాన్స్ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్

వాటిగినెస్ (ఫ్రాన్స్) : యూరోప్ పర్యటనలో ఉన్న భారత పురుషుల హాకీ జట్టు ఫ్రాన్స్ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తొలి మ్యాచ్‌లో 2-0తో నెగ్గిన సర్దార్ సింగ్ బృందం... బుధవారం జరిగిన రెండో మ్యాచ్‌లో 4-1తో ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున గుర్జిందర్ (14వ, 44వ ని.లో) రెండు గోల్స్ చేయగా... మొహమ్మద్ ఆమిర్ ఖాన్ (30వ ని.లో), రూపిందర్ పాల్ సింగ్ (52వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఫ్రాన్స్ జట్టుకు బౌమ్‌గార్టెన్ (21వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. భారత్ ఈనెల 10న స్పెయిన్‌తో మ్యాచ్ ఆడుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement