సెపక్‌తక్రాలో కాంస్యంతో సరి | India claims bronze in Sepaktakraw | Sakshi
Sakshi News home page

సెపక్‌తక్రాలో కాంస్యంతో సరి

Aug 21 2018 3:54 PM | Updated on Aug 21 2018 3:57 PM

India claims bronze in Sepaktakraw - Sakshi

జకార్తా: ఏషియన్‌ గేమ్స్‌ 2018లో భాగంగా సెపక్‌తక్రా పురుషుల ఈవెంట్‌లో భారత జట్టు కాంస్యంతో సరిపెట్టుకుంది. మంగళవారం థాయ్‌లాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ పోరులో భారత్‌ జట్టు ఓటమి పాలైంది. ఈ పోరులో ఏమాత్రం పోటీ ఇవ్వలేని భారత్‌ 0-2 తేడాతో పరాజయం చెందింది. ఫలితంగా కాంస్యాన్ని మాత్రమే దక్కించుకోగల్గింది.

ఇది ఓవరాల్‌ ఏషియన్‌ గేమ్స్‌ లో భారత్‌కు తొలి సెపక్‌తక్రా పతకం కావడం విశేషం. దాంతో ఇప్పటివరకూ భారత్‌ సాధించిన పతకాల సంఖ్య 9కి చేరింది. భారత్‌ ఖాతాలో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలు ఉన్నాయి.

చదవండి: ‘రజత’ రాజ్‌పుత్‌

పరిమళించిన యువ ‘సౌరభం’

Advertisement
 
Advertisement
Advertisement