ఏషియన్‌ గేమ్స్‌: ‘రజత’ రాజ్‌పుత్‌ | Sanjeev Rajput wins silver in 50m Rifle 3 positions shooting | Sakshi
Sakshi News home page

ఏషియన్‌ గేమ్స్‌: ‘రజత’ రాజ్‌పుత్‌

Aug 21 2018 1:17 PM | Updated on Aug 21 2018 1:38 PM

Sanjeev Rajput wins silver in 50m Rifle 3 positions shooting - Sakshi

జకార్తా: ఏషియన్‌ గేమ్స్‌ 2018లో భాగంగా భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. భారత స్టార్‌ షూటర్‌ సంజీవ్‌ రాజ్‌పుత్‌ రజత పతకాన్ని సాధించాడు. మంగళవారం జరిగిన పురుషుల 50 మీటర్ల త్రీ పొజిషన్‌ ఫైనల్లో రాజ్‌పుత్‌ ఆద్యంతం ఆకట్టుకుని రజతాన్ని ఖాయం చేసుకున్నాడు. మొత్తంగా 452. 7 పాయింట్ల స్కోరు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. దాంతో ఇప్పటివరకూ భారత్‌ సాధించిన పతకాల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఇందులో మూడు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి.

అంతకుముందు ఈ రోజు క్రీడల్లో  సౌరభ్‌ చౌదరి స్వర్ణ పతకాన్ని సాధించాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భాగంగా ఫైనల్‌ పోరులో సౌరభ్‌ చౌదరి 240.7 పాయింట్లు సాధించి పసిడిని ఖాతాలో వేసుకున్నాడు. ఇదే విభాగంలో మరో భారత షూటర్‌ అభిషేక్‌ వర్మ కాంస్య పతకాన్ని సాధించాడు. మొత్తంగా 219.3 పాయింట్ల స్కోరు సాధించి కాంస్యాన్ని దక్కించుకున్నాడు.

చదవండి: పరిమళించిన యువ ‘సౌరభం’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement