మనోళ్లు పాక్ నుంచి లాగేసుకున్నారు | India becomes No.1 ranked Test team | Sakshi
Sakshi News home page

మనోళ్లు పాక్ నుంచి లాగేసుకున్నారు

Oct 3 2016 5:35 PM | Updated on Jul 25 2018 1:49 PM

మనోళ్లు పాక్ నుంచి లాగేసుకున్నారు - Sakshi

మనోళ్లు పాక్ నుంచి లాగేసుకున్నారు

న్యూజిలాండ్తో రెండో టెస్టులో విరాట్ కోహ్లీ సేన ఘన విజయం సాధించి.. సిరీస్తో పాటు నెంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకుంది.

కోల్కతా: టీమిండియా ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టింది. కోల్కతాలో న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్టులో విరాట్ కోహ్లీ సేన 178 పరుగులతో ఘన విజయం సాధించి.. సిరీస్తో పాటు పాకిస్థాన్ వద్ద ఉన్న నెంబర్వన్ ర్యాంక్ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్తో మూడు టెస్టుల సిరీస్లో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 2-0తో సిరీస్ను కైవసం చేసుకుంది. అంతేగాక ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్న పాక్ను భారత్ వెనక్కునెట్టి మళ్లీ నెంబర్వన్గా నిలిచింది.

సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో టీమిండియా ఈ ఘనత సాధించడం అభిమానులకు సంతోషం కలిగిస్తోంది. పాక్ చరిత్రలో తొలిసారి నంబర్‌వన్ కాగానే ఆ దేశ అభిమానులు భారత్‌ను కవ్వించేలా సోషల్ మీడియా ద్వారా రకరకాల విమర్శలు చేశారు. ఇప్పుడు విరాట్ సేన న్యూజిలాండ్‌పై గెలిచి ఆ ర్యాంక్‌ను లాగేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement