టి-20 వరల్డ్ కప్: పాకిస్థాన్పై భారత్ ఘనవిజయం | India beats Pakisthan in t-20 world cup | Sakshi
Sakshi News home page

టి-20 వరల్డ్ కప్: పాకిస్థాన్పై భారత్ ఘనవిజయం

Mar 21 2014 10:15 PM | Updated on Sep 2 2017 5:00 AM

టి-20 వరల్డ్ కప్: పాకిస్థాన్పై భారత్ ఘనవిజయం

టి-20 వరల్డ్ కప్: పాకిస్థాన్పై భారత్ ఘనవిజయం

ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించింది.

మిర్పూర్: ట్వంటీ 20 వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ ఏడు వికెట్లతో ఘనవిజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 131 పరుగుల లక్ష్యాన్ని ధోనీసేన మరో 9 బంతులు మిగిలుండగా కేవలం మూడు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. టాపార్డర్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ (24), శిఖర్ ధవన్ (30), విరాట్ కోహ్లీ (36 నాటౌట్), సురేష్ రైనా (35 నాటౌట్) రాణించారు. ఓపెనర్లు రోహిత్, ధవన్ జట్టుకు శుభారంభం అందివ్వగా, కోహ్లీ, రైనా విజయతీరాలకు చేర్చారు.

టాస్ గెలిచిన టీం ఇండియా ముందుగా పాకిస్తాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పాకిస్తాన్ ఆదిలోనే తడబడింది. కమ్రాన్ అక్మల్(8) పరుగులకే రనౌట్ రూపంలో పెవిలియన్ చేరడంతో పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం మరో ఓపెనర్ అహ్మద్ షెహజాద్ స్కోరును నెమ్మదిగా ముందుకు తీసుకువెళ్లాడు. షెహజాద్(22) పరుగుల వద్ద మిశ్రా బౌలింగ్ లో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడంతో భారత్ మ్యాచ్ పై పట్టు సాధించింది.

స్కోరును పెంచే క్రమంలో మహ్మద్ హఫీజ్(15), ఉమర్ అక్మల్(33) దూకుడుగా ఆడి పెవిలియన్ బాటపట్టారు.చివర్లో షోయమ్ మాలిక్(18), షోయబ్ మస్సూద్(21) పరుగులు చేయడంతో పాకిస్తాన్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఏడు వికెట్లు కోల్పోయి 130పరుగులు చేసింది. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీయగా, జడేజా, షమీ, భువనేశ్వర్ కుమార్ లకు తలో వికెట్ తీశారు.

Advertisement
 
Advertisement
Advertisement