భారత్‌దే కాంస్య పతకం | India beat Germany 2-1 to reclaim bronze at HWL Final | Sakshi
Sakshi News home page

భారత్‌దే కాంస్య పతకం

Dec 10 2017 7:45 PM | Updated on Dec 10 2017 7:46 PM

India beat Germany 2-1 to reclaim bronze at HWL Final - Sakshi

భువనేశ్వర్‌: ప్రతిష్టాత్మక హాకీ వరల్డ్‌ లీగ్‌ (హెచ్‌డబ్ల్యూఎల్‌) ఫైనల్స్‌ టోర్నమెంట్‌లో భాగంగా కాంస్య పతకం సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఆకట్టుకుంది. ఆదివారం  ఒలింపిక్ విజేత, ప్రపంచ మాజీ చాంపియన్‌ జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. మూడు-నాలుగు స్థానాల కోసం జరిగిన పోరులో భారత్‌ 2-1 తేడాతో జర్మనీని బోల్తా కొట్టించి కాంస్యాన్ని దక్కించుకుంది.

ఆట ప్రారంభమైన 21 నిమిషాలకే ఎస్‌వీ సునీల్‌ గోల్‌ సాధించి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు. ఆపై జర్మనీ 36 నిమిషంలో గోల్‌ సాధించడంతో స్కోరు సమం అయ్యింది. మార్క్‌ ఆప్పెల్‌ గోల్‌ చేశాడు. కాగా, 54వ నిమిషంలో భారత్‌ ఆటగాడు హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి 2-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. ఆపై జర్మనీ గోల్‌ కోసం శత విధాలా ప్రయత్నించినా భారత్‌ రక్షణశ్రేణిని అధిగమించలేకపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement