భారత్‌కు మూడో విజయం | India Beat Australia In The International Junior Hockey Tournament | Sakshi
Sakshi News home page

భారత్‌కు మూడో విజయం

Oct 17 2019 5:55 AM | Updated on Oct 17 2019 5:55 AM

India Beat Australia In The International Junior Hockey Tournament - Sakshi

జొహర్‌ బారు (మలేసియా): సుల్తాన్‌ జొహర్‌ కప్‌ అంతర్జాతీయ జూనియర్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత్‌ ఖాతాలో మూడో విజయం చేరింది. ఆ్రస్టేలియాతో బుధవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 5–1 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున శిలానంద్‌ లాక్రా (26వ, 29వ నిమిషాల్లో) రెండు గోల్స్‌ చేయగా... దిల్‌ప్రీత్‌ సింగ్‌ (44వ ని.లో), గుర్‌సాహిబ్జిత్‌ సింగ్‌ (48వ ని.లో), మన్‌దీప్‌ మోర్‌ (50వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. ఆ్రస్టేలియాకు ఆరోన్‌ నైట్‌ (57వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోరీ్నలో భారత్‌ 9 పాయింట్లతో బ్రిటన్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. గురువారం విశ్రాంతి దినం. శుక్రవారం జరిగే తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో బ్రిటన్‌తో భారత్‌ తలపడుతుంది. లీగ్‌ దశ పూర్తయ్యాక పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్లో ఆడతాయి. భారత్‌–బ్రిటన్‌ మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిస్తే రెండు జట్లు ఫైనల్‌కు చేరుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement