కృనాల్‌, ఖలీల్‌పై ఆగ్రహం!

Ind Vs Ban: Krunal And Khaleel Faces the Heat - Sakshi

ఢిల్లీ: బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో భారత్‌ ఓటమి పాలైన తర్వాత కృనాల్‌ పాండ్యా, ఖలీల్‌ అహ్మద్‌లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇద్దరి వల్లే మ్యాచ్‌ను కోల్పోయామంటూ సోషల్‌ మీడియాలో  ఉతికి ఆరేస్తున్నారు. బంగ్లాదేశ్‌ కీలక ఆటగాడు ముష్పికర్‌ రహీమ్‌ క్యాచ్‌ను కృనాల్‌ పాండ్యా వదిలేయగా, ఖలీల్‌ అహ్మద్‌ నియంత్రణ లేని బౌలింగ్‌ వేశాడు. దాంతో వీరిద్దరిపై విమర్శల వర్షం కురుస్తోంది.‘అసలు కృనాల్‌ పాండ్యాను భారత జట్టులో ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు’ అని ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, ‘ ఏ ఉపాధి పథకం కింద ఖలీల్‌కు చోటు కల్పించారు’ అని మరొకరు ఎద్దేవా చేశారు. (ఇక్కడ చదవండి:భారత్‌పై బంగ్లా విజయం)

‘ ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓటమి తర్వాత ఇక అండర్‌ గ్రౌండ్‌లో దాక్కోవాలేమో’ అని మరొకరు ట్వీట్‌ చేశారు. ‘ కృనాల్‌ నువ్వు అక్కడే ఉండు.. మేము వస్తున్నాం’ అని మరొక అభిమాని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై దాడి చేయడానికి వెళుతున్న ఫొటోనే షేర్‌ చేశాడు. ‘కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ఖలీల్, కృణాల్ పాండ్యా లాంటి వారిలో పరిపక్వత లేదు. ఇలాంటి జట్టుతో భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవలేదు’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ‘శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, నవదీప్ శైనీని పక్కనపెట్టి జట్టులో చోటు కల్పించడానికి ఖలీల్ అహ్మద్ ఏం అద్భుతాలు చేశాడు. తను చేసిందల్లా ధారాళంగా పరుగులివ్వడమే’ అని మరో అభిమాని కామెంట్ చేశారు.

ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఆటగాడు రహీమ్‌ క్యాచ్‌ వదిలేయడంతో అతను గెలుపుతో ఆ జట్టుకు మంచి ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. ఖలిల్‌ అహ్మద్‌ వేసిన 19 ఓవర్‌లో వరుసగా నాలుగు బౌండరీలు కొట్టడం మ్యాచ్‌కే హైలెట్‌. ఫలితంగా మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌ సులువుగా ఎగరుసుకుపోయింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top