ప్రిక్వార్టర్స్‌లో నిఖత్ | In the pre-quarters enter to nikhat | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో నిఖత్

May 21 2016 1:36 AM | Updated on Oct 22 2018 9:16 PM

ప్రిక్వార్టర్స్‌లో నిఖత్ - Sakshi

ప్రిక్వార్టర్స్‌లో నిఖత్

ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి....

అస్తానా (కజకిస్తాన్ ): ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన 54 కేజీల విభాగం తొలి రౌండ్‌లో నిఖత్ 2-1తో బియాంకా ఎల్ మీర్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎరికా అడ్‌జీ (కెనడా)తో నిఖత్ తలపడుతుంది.

75 కేజీల విభాగంలో పూజా రాణి, 57 కేజీల విభాగంలో సోనియా లాథెర్ కూడా శుభారంభం చేశారు. మరియా బొరుత్సా (ఉక్రెయిన్)పై పూజా రాణి... గెండెగ్మా మ్యాగ్మార్ (మంగోలియా)పై సోనియా గెలుపొందారు.

Advertisement
 
Advertisement
Advertisement