‘నా క్రేజే వేరు.. బ్రాండ్‌ వాల్యూ రెట్టింపు చేస్తా’

I Will Spread PSL's Brand Value, Shoaib Akhtar - Sakshi

నన్ను వాడుకోండి బాస్‌: అక్తర్‌

కరాచీ:  తమ దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తనకున్న క్రేజ్‌ ప్రత్యేకమని పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ తనకు తాను  కితాబు ఇచ్చేసుకున్నాడు. పాకిస్తాన్‌ ప్రజల చేత అత్యంత ప్రేమించబడే వ్యక్తులలో తాను కూడా ఒకడినని అక్తర్‌ పేర్కొన్నాడు.  అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా అక్తర్‌ అంటే ఒక ఫేమస్‌ పేరనే విషయం తెలుసుకోవాలన్నాడు. ఇక్కడ అక్తర్‌ గుర్తింపు పొందిన క్రికెటర్‌ అనే విషయం అందరికీ తెలిసినా ఈ వ్యాఖ్యల వెనుక కారణం  మాత్రం వ్యాపార కోణం ఉంది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో తాను కూడా ఒక జట్టుకు యజమాని కావాలని ఉవ్విళ్లూరడమే అక్తర్‌ వ్యాఖ్యల వెనుకున్న ఉద్దేశం. పీఎస్‌ఎల్‌ విలువను తన పేరుతో పెంచుతానని అక్తర్‌ వ్యాఖ్యానించాడు.

‘పాకిస్తాన్‌లోనే కాదు... నేను వరల్డ్‌వైడ్‌ బాగా ఫేమస్‌. నాకున్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సెపరేటు. ప్రజలకు నాకు గురించి బాగా తెలుసు. పీఎస్‌ఎల్‌ బ్రాండ్‌ వాల్యూ పెరగాలంటే నాకు అందులో ఒక జట్టు ఉంటే బాగుంటుంది. పీఎస్‌ఎల్‌లో నాకు పెట్టుబడులు పెట్టే అవకాశం వస్తే పీఎస్‌ఎల్‌ బ్రాండ్‌ వాల్యూ అమాంతం పెరిగిపోతుంది. రెండు పీఎస్‌ఎల్‌ రెండు జట్లను పీసీబీ తీసుకోవాలి. అందులో ఒక జట్టు కోసం నేను బిడ్‌ వేస్తా’ అని అక్తర్‌ చెప్పుకొచ్చాడు. (హెడ్‌ లైన్స్‌ కాదు.. ఆర్టికల్‌ మొత్తం చదువు)

కరోనా వైరస్‌ మహమ్మారి ప్రపంచాన్ని అతాలకుతలం చేస్తున్న సమయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగడం ఒక్కటే మార్గమని ఇటీవల షోయబ్‌ అక్తర్‌ సూచించాడు. కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో పడిపోయిన సమయంలో ఒకరికోసం ఒకరు నిలబడాలంటూ పేర్కొన్నాడు. ఇక్కడ దొంగ నిల్వలు అనేవి పెట్టుకోవద్దని అక్తర్‌ విజ్ఞప్తి చేశాడు. మనం నిత్యావసరాలను దొంగ నిల్వలుగా పెట్టుకునే సమయంలో రోజు వారీ శ్రామికుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని హితవు పలికాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top