నేను బీసీసీఐ బాస్ కాదు! | I have to look after interests of 105 countries… BCCI must look after theirs: ICC chairman Shashank Manohar | Sakshi
Sakshi News home page

నేను బీసీసీఐ బాస్ కాదు!

Sep 9 2016 11:44 AM | Updated on Sep 4 2017 12:49 PM

నేను బీసీసీఐ బాస్ కాదు!

నేను బీసీసీఐ బాస్ కాదు!

గత మేనెలలోఅంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి ఏకగీవ్రంగా ఎన్నికైన శశాంక్ మనోహర్.. భారత క్రికెట్ మండలి(బీసీసీఐ)కి అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలపై తనదైన శైలిలో స్పందించారు.

దుబాయ్: గత మేనెలలోఅంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అధ్యక్షుడిగా ఏకగీవ్రంగా ఎన్నికైన శశాంక్ మనోహర్.. భారత క్రికెట్  మండలి(బీసీసీఐ)కి అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపణలపై తనదైన శైలిలో స్పందించారు.  ప్రస్తుతం ఐసీసీలో కీలక పదవిలో ఉన్నందును బీసీసీఐ క్రికెట్ బోర్డుక అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం తగని పని స్ఫష్టం చేశారు. తాను బీసీసీఐకి బాస్ను కాదని, ఐసీసీకి బాస్ అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఈ మేరకు ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో మనోహర్ పలు విషయాలు వెల్లడించారు.

'నేను ఐసీసీలో ఉన్న 105 దేశాలకు ప్రతినిధిని. ఐసీసీ స్వలాభాలకోసం పనిచేయాలి.  అది నా డ్యూటీ. కేవలం ఏదొక వ్యక్తిగత దేశమే నన్ను ఎన్నకోలేదు. ప్రపంచంలో వివిధ దేశాలు నన్ను ఏకీగ్రీవంగా ఎన్నుకున్నాయి. అటువంటప్పుడు ఏదొక క్రికెట్ బోర్డు ప్రయోజనాలకోసం పని చేయలేను. ఏ ఒక్కరి సంతృప్తి కోసమో పని చేయలేను. బీసీసీఐ వ్యవహారాలను ఆ బోర్డే పర్యవేక్షించుకుంటుంది' అని మనోహర్ తెలిపారు.

ఐసీసీ చైర్మన్గా శశాంక్ మనోహర్ పదవి చేపట్టి దాదాపు నాలుగు నెలలు అయ్యింది. అయితే ఐసీసీ ఆర్థిక, వ్యాపార కార్యక్రమాల్లో  భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నుంచి ఏ ఒక్కరికీ ప్రాతినిథ్యం కల్పించకపోవడంపై మనోహర్పై ఆరోపణలు వెలుగుచూశాయి. కాగా, మనోహర్ వాదన మరోలా ఉంది. వచ్చే అక్టోబర్లో కొత్తగా ఫైనాన్షియల్, చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీలు ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. ఆ కమిటీలను బోర్డు డైరెక్టర్ల ఆమోదం మేరకు ఏర్పాటు చేయనున్నట్లు మనోహర్ స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement