నాతో అతన్ని పోల్చకండి: యువీ | I Don't Think Dube Should Be Compared To Me Yuvraj | Sakshi
Sakshi News home page

నాతో అతన్ని పోల్చకండి: యువీ

Nov 7 2019 10:47 AM | Updated on Nov 7 2019 4:09 PM

I Don't Think Dube Should Be Compared To Me Yuvraj - Sakshi

న్యూఢిల్లీ: గతేడాది బరోడాతో జరిగిన ఓ మ్యాచ్‌లో  వరుసగా నాలుగు సిక్సర్లు బాదేసి అందర్నీ ఆకర్షించాడు ముంబై క్రికెటర్‌ శివం దూబే. దేశవాళీ క్రికెట్‌లో హార్డ్‌ హిట్టర్‌గా పేరుగాంచి ఇటీవలే భారత జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసిన దూబే తొలి మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో తొలి టీ20కి ముందు నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ యువరాజ్‌ సింగ్‌ తరహా బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు.  దాంతో మనకు మరొక యువరాజ్‌ దొరికేశాడంటూ అభిమానులు ఫుల్‌ ఖుషీ అయ్యారు.

కాగా, తొలి టీ20లోనే దూబే తీవ్రంగా నిరాశపరిచాడు. దూబేను తనతో పోల్చడంపై యువరాజ్‌ స్పందించాడు. అప్పుడే అతన్ని  తనతో పోల్చవద్దు అంటూ అభిమానులను కోరాడు. . ‘అతడ్ని ముందు సాఫీగా కెరీర్‌ స్టార్ట్ చేయనివ్వండి. రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడుతూ ఓ స్థాయికి వెళ్లిన తర్వాత అప్పుడు కావాలంటే వేరొక ఆటగాడితో పోలికలు తీసుకురావొచ్చు. అప్పుడే తనతో పోల్చకండి. అతనికంటూ ఓ పేరు, ప్రతిభ ఉన్నాయి. శివమ్ దూబే బ్యాటింగ్‌లో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంది. ఆ లోపాల్ని టీమిండియా మేనేజ్‌మెంట్ గుర్తించిందో లేదో నాకు తెలీదు’ అని యువరాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో తొలి టీ20లో దూబే నాలుగు బంతులు ఆడి పరుగు మాత్రమే చేశాడు. అఫిఫ్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఈరోజు రెండో టీ20 జరుగనున్న తరుణంలో దూబే ఎంతవరకూ ఆకట్టుకుంటాడో వేచి చూడాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement