'ఇదే నా ముగింపు సిరీస్ అవుతుందనుకున్నా' | I deserve a farewell series, says disappointed Chanderpaul | Sakshi
Sakshi News home page

'ఇదే నా ముగింపు సిరీస్ అవుతుందనుకున్నా'

May 28 2015 8:21 PM | Updated on Oct 1 2018 5:14 PM

'ఇదే నా ముగింపు సిరీస్ అవుతుందనుకున్నా' - Sakshi

'ఇదే నా ముగింపు సిరీస్ అవుతుందనుకున్నా'

త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కు వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ శివనారయణ్ చందర్ పాల్ ను ఎంపిక చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశాడు.

జోహన్స్ బర్గ్: త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే రెండు టెస్టుల సిరీస్ కు వెస్టిండీస్ వెటరన్ క్రికెటర్ శివనారయణ్ చందర్ పాల్ ను ఎంపిక చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది తన కెరీర్ లో చివరి సిరీస్ అవుతుందనుకుని భావించినా.. తుది జట్టులో ఎంపిక కాకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. చందరపాల్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపు దశకు చేరుకున్నప్పటికీ అతను ఇంకా క్రికెట్ వీడ్కోలు తీసుకోని సంగతి తెలిసిందే. అయితే దీనిపై వెస్టిండీస్ బోర్డుకు చందర్ పాల్ విన్నవించినా సరైన స్పందన రాలేదు.

ఇదిలా ఉండగా దీనిపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చైర్మన్ క్లైవ్ లాయిడ్ భిన్నంగా స్పందించాడు. వెస్టిండీస్ క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా యువకులకు చాన్స్ ఇచ్చే క్రమంలోనే చందరపాల్ కు చోటు దక్కలేదన్నాడు. గురువారం ప్రకటించిన 12 మంది సభ్యులతో కూడిన క్రికెటర్ల జాబితాలో చందరపాల్ కు చోటు లభించలేదు.

Advertisement
 
Advertisement
Advertisement