source: X
టాస్ ఆలస్యం
6:36 PM: భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య బెంగళూరు వేదికగా ఇవాళ జరగాల్సిన నిర్ణయాత్మక ఐదో టీ20 వర్షం కారణంగా ఆలస్యమయ్యింది. 6:30 గంటలకు టాస్ పడాల్సి ఉండగా.. వర్షం కారణంగా ఇప్పటివరకు పడలేదు. టాస్ సమయానికి వర్షం మరింత అధికమైంది.
కాగా, ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు చెరో రెండు గెలవడంతో ప్రస్తుతం సిరీస్ సమంగా ఉంది. నేటి మ్యాచ్లో గెలిచే జట్టే సిరీస్ కైవసం చేసుకుంటుంది.
ఇదీ చదవండి: భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త.. చరిత్రలో తొలిసారి..!


