మళ్లీ పోటీ చేస్తా: మీడియాకు శ్రీనివాసన్ సవాల్ | I am going to contest: BCCI chief N Srinivasan | Sakshi
Sakshi News home page

మళ్లీ పోటీ చేస్తా: మీడియాకు శ్రీనివాసన్ సవాల్

Sep 19 2013 6:19 PM | Updated on Sep 1 2017 10:51 PM

మళ్లీ పోటీ చేస్తా: మీడియాకు శ్రీనివాసన్ సవాల్

మళ్లీ పోటీ చేస్తా: మీడియాకు శ్రీనివాసన్ సవాల్

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, ఇతర కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ ఎన్ శ్రీనివాసన్ బోర్దు ఎన్నికల్లో టాప్ పోస్ట్ కు పోటీ చేస్తానని గురువారం ప్రకటించారు.

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, ఇతర కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చీఫ్ ఎన్ శ్రీనివాసన్ బోర్దు ఎన్నికల్లో టాప్ పోస్ట్ కు పోటీ చేస్తానని గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ 29న జరిగే ఎన్నికల్లో మళ్లీ అధ్యక్ష పదవికి పోటి పడుతానని ఆయన తెలిపారు. బీసీసీఐ మార్కెటింగ్ కమిటీ సమావేశంలో శ్రీనివాసన్ మాట్లాడుతూ.. మీడియా తనకు వ్యతిరేకంగా ప్రచారం చేసినా ఎన్నికల్లో పోటికి నిలబడుతానని సవాల్ విసిరాడు. 
 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో తన అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్రిన్సిపల్ గురునాథ్ మేయప్పన్ పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తడంతో శ్రీనివాసన్ రాజీనామా చేయాలంటూ ఒత్తిడి పెరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాలనంతరం శ్రీనివాసన్ పక్కకు తప్పించి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్ మోహన్ ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement