విజేత హైదరాబాద్‌ మహిళల జట్టు | Hyderabad Womens Team got Tug of war Title | Sakshi
Sakshi News home page

విజేత హైదరాబాద్‌ మహిళల జట్టు

Aug 13 2018 10:35 AM | Updated on Sep 4 2018 5:53 PM

Hyderabad Womens Team got Tug of war Title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర టగ్‌ ఆఫ్‌ వార్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ మహిళల, రంగారెడ్డి పురుషుల జట్లు విజేతలుగా నిలిచాయి. మహబూబాబాద్‌లో జరిగిన ఈ టోర్నీ పురుషుల 640 కేజీ ఫైనల్లో రంగారెడ్డి 3–0తో యాదాద్రిపై గెలుపొంది స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో వరంగల్‌ 3–0తో హైదరాబాద్‌పై విజయం సాధించి కాంస్యాన్ని గెలుచుకుంది.

అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో రంగారెడ్డి 3–0తో వరంగల్‌పై, యాదాద్రి 3–0తో హైదరాబాద్‌పై గెలిచాయి. మరోవైపు మహిళల 500 కేజీ తుదిపోరులో హైదరాబాద్‌ 3–0తో యాదాద్రిని ఓడించి విజేతగా నిలిచింది. రంగారెడ్డి 3–0తో వరంగల్‌పై గెలుపొంది మూడో స్థానాన్ని దక్కించుకుంది. సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌ 3–0తో రంగారెడ్డిపై, యాదాద్రి 3–0తో వరంగల్‌పై గెలుపొందాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement