మూడో రౌండ్‌కు హంపి | Humpy beats Tingjei Lei, in sight of last 16 | Sakshi
Sakshi News home page

మూడో రౌండ్‌కు హంపి

Mar 22 2015 12:46 AM | Updated on Sep 2 2017 11:11 PM

మూడో రౌండ్‌కు హంపి

మూడో రౌండ్‌కు హంపి

ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. శనివారం లీ తింగ్‌జీ (చైనా)తో జరిగిన రెండో రౌండ్ రెండో గేమ్‌లోనూ హంపి విజయం సాధించింది.

సోచి (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. శనివారం లీ తింగ్‌జీ (చైనా)తో జరిగిన రెండో రౌండ్ రెండో గేమ్‌లోనూ హంపి విజయం సాధించింది. దీంతో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. ఈ గేమ్‌లో తెల్ల పావులతో ఆడిన హంపి 42 ఎత్తుల్లో ముగించింది. మరోవైపు ద్రోణవల్లి హారిక, ఇరీనా క్రుష్ (అమెరికా)తో తన రెండో రౌండ్ రెండో గేమ్‌ను కూడా డ్రా చేసుకుంది. నేడు (ఆదివారం) జరిగే టైబ్రేకర్‌లో నెగ్గినవారు మూడో రౌండ్‌కు వెళతారు.

Advertisement
 
Advertisement
Advertisement