ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీకి హుమేరా, భక్తి, సంస్కృతి | Humera, Bhakti Shaw to French Open Qualifiers | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీకి హుమేరా, భక్తి, సంస్కృతి

Apr 18 2019 3:35 PM | Updated on Apr 18 2019 3:35 PM

Humera, Bhakti Shaw to French Open Qualifiers - Sakshi

న్యూఢిల్లీ: ఫ్రెంచ్‌ ఓపెన్‌ జూనియర్‌ వైల్డ్‌ కార్డు టోర్నమెంట్‌లో పాల్గొనే క్రీడాకారుల జాబితాను అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ–ఐటా) ప్రకటించింది. బాలికల సింగిల్స్‌ విభాగంలో ఎనిమిది మంది... బాలుర సింగిల్స్‌ విభాగంలో ఎనిమిది మందిని ‘ఐటా’ ఎంపిక చేసింది. ఏప్రిల్‌ 29 నుంచి మే 1 వరకు న్యూఢిల్లీలో ఈ టోర్నీ జరుగుతుంది. బాలికల విభాగంలో తెలంగాణకు చెందిన షేక్‌ హుమేరా, దామెర సంస్కృతి, భక్తి షాలకు అవకాశం లభించింది.

ఈ టోర్నీ విజేతలు పారిస్‌లో జరిగే ఫ్రెంచ్‌ ఓపెన్‌ జూనియర్‌ వైల్డ్‌ కార్డు టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. ఆ టోర్నీలో చైనా, బ్రెజిల్, జపాన్, కొరియా అమెరికాలకు చెందిన ఆటగాళ్లు కూడా పాల్గొంటారు. విజేతగా నిలిచిన వారికి ఫ్రెంచ్‌ ఓపెన్‌ జూనియర్‌ ప్రధాన టోర్నమెంట్‌లో నేరుగా ఆడే అవకాశం లభిస్తుంది. గత నాలుగేళ్లుగా భారత్‌లో ఈ టోర్నీ జరుగుతోంది.

బాలికల సింగిల్స్‌: షేక్‌ హుమేరా, భక్తి షా, దామెర సంస్కృతి, సాల్సా అహిర్, కావ్య సాహ్ని, సారా దేవ్, నికిత విశ్వాసె, గార్గి పవార్‌.  
బాలుర సింగిల్స్‌: మన్‌ మౌలిక్‌ షా, దేవ్‌ జావియా, కబీర్‌ హన్స్, మద్విన్‌ కామత్, సుశాంత్‌ దబస్, దివేశ్‌ గెహ్లట్, రిథమ్‌ మల్హోత్రా, డెనిమ్‌ యాదవ్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement