French Open 2025: ఫైనల్ పోరులో అల్‌కరాజ్‌ X సినెర్‌ | French Open 2025: Carlos Alcaraz on Jannik Sinner in Men's final | Sakshi
Sakshi News home page

French Open 2025: ఫైనల్ పోరులో అల్‌కరాజ్‌ X సినెర్‌

Jun 8 2025 8:37 AM | Updated on Jun 8 2025 11:00 AM

French Open 2025: Carlos Alcaraz on Jannik Sinner in Men's final

ఫ్రెంచ్ ఓపెన్‌-2025 పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ పోరుకు రంగం సిద్ద‌మైంది. ఆదివారం జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్లో ప్రపంచ నంబర్‌వన్‌ యానిక్‌ సినెర్‌ (ఇటలీ)తో ప్రపంచ రెండో ర్యాంకర్, డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) అమీతుమీ తేల్చుకుంటాడు.

ముఖాముఖి పోరులో అల్‌కరాజ్‌ 7–4తో సినెర్‌పై ఆధిక్యంలో ఉన్నాడు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ సినెర్‌ 6–4, 7–5, 7–6 (7/3)తో సెర్బియా దిగ్గజం నొవాక్‌ జొకోవిచ్‌ను ఓడించి తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఫైనల్లోకి ప్రవేశించాడు.

కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన జొకోవిచ్‌ ఈ ఓటమి తర్వాత ఎర్రమట్టి కోర్టును ముద్దాడుతూ వెనుదిరిగాడు. వచ్చే ఏడాది తాను ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ఆడేది లేనిది కచ్చ్చితంగా చెప్పలేనని 38 ఏళ్ల జొకోవిచ్‌ వ్యాఖ్యానించాడు.
చదవండి: French Open 2025: ఫ్రెంచ్ ‘క్వీన్‌’ కోకో.. ఫైనల్లో సబలెంకా ఓటమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement