అమీర్ ఖాన్ కు షాకిచ్చిన సచిన్!
ఎందరో క్రికెటర్లకు తన ఆటతో దిమ్మతిరిగేలా షాకిచ్చిన సచిన్ టెండూల్కర్ ఒకానొక సందర్భంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా మతిపోయేంత పని చేశాడట.
ఎందరో క్రికెటర్లకు తన ఆటతో దిమ్మతిరిగేలా షాకిచ్చిన సచిన్ టెండూల్కర్ ఒకానొక సందర్భంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా మతిపోయేంత పని చేశాడట. 2008లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ను సచిన్ తో కలిసి అమీర్ ఖాన్ చూశాడట.
ఆ మ్యాచ్ జరుగుతున్నంత సేపు ప్రతి బంతి ముందు విశ్లేషణాత్మక కామెంటరీని చెప్పాడని అమీర్ ఖాన్ మేనల్లుడు నటుడు ఇమ్రాన్ ఖాన్ తెలిపాడు. బౌలర్ ప్రతి బంతిని ఎలా వేస్తాడు.. ఆ బంతిని బ్యాట్స్ మెన్ ఎలా ఆడుతాడు.. అని ముందే చెప్పడం అమీర్ ను షాక్ గురిచేసింది అని ఇమ్రాన్ తెలిపాడు.
బౌలర్ ఇప్పడు ఆఫ్ స్పిన్ వేస్తాడు.. ఆ బంతిని బ్యాట్స్ మెన్ అలా ఆడుతాడు అని అమీర్ కు ముందే సచిన్ వివరించడం ఆటపట్ల అతనికి ఎంత అంకితభావం ఉందో ఆ సందర్భంగా తెలుసుకున్నాను అని ఇమ్రాన్ తెలిపాడు. మూడు సెకన్ల ముందే సచిన్ ఊహించిన విధంగా ప్రతిది జరిగింది అని ఇమ్రాన్ ఆనాటి సంఘటనను గుర్తు తెచ్చుకున్నారు.