క్రిస్ గేల్.. స్నేహా ఉల్లాల్... | How Chris Gayle Partied With Sneha Ullal | Sakshi
Sakshi News home page

క్రిస్ గేల్.. స్నేహా ఉల్లాల్...

Mar 17 2016 6:23 PM | Updated on Sep 3 2017 7:59 PM

క్రిస్ గేల్.. స్నేహా ఉల్లాల్...

క్రిస్ గేల్.. స్నేహా ఉల్లాల్...

విధ్వంసానికి పరాకాష్ట క్రిస్‌గేల్ బుధవారం జరిగిన టీ20 మ్యాచ్ లో సెంచరీ కొట్టిన తరువాత స్టేడియంలో వేసిన స్టెప్పులు క్రికెట్ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోయేవి కావు.

విధ్వంసానికి పరాకాష్ట క్రిస్‌గేల్ బుధవారం జరిగిన టీ20 మ్యాచ్ లో సెంచరీ కొట్టిన తరువాత స్టేడియంలో వేసిన స్టెప్పులు క్రికెట్ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోయేవి కావు. సహచరులంతా కలిసి గేల్ ను అనుకరిస్తూ రెస్ట్ రూంలో హంగామా సృష్టించారు. స్టేడియంలో అభిమానులకి పరిచయం చేసిన ఆ సరికొత్త స్టెప్ బ్రేవో డీజెగా మారి కంపోజ్ చేసిన 'చాంపియన్' పాటకు సంబంధించింది.  ప్రస్తుతం గేల్ ఇంట్రడ్యూస్ చేసిన 'చాంపియన్' స్టెప్ కుర్రకారుని ఉర్రూతలూగిస్తుంది.

మ్యాచ్ కంటే ముందే బ్రేవో, గేల్ కలిసి ఓ పార్టీలో చాంపియన్ పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. వీరికి నటి స్నేహా ఉల్లాల్ కూడా తోడవడంతో పార్టీ పీక్స్కు చేరింది. సల్మాన్ ఖాన్ సహకారంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన స్నేహా ఉల్లాల్ ఈ మధ్యకాలంలో సినిమాల్లో కనిపించింది తక్కువే. అయితే తాజాగా గేల్ తో కలిసి స్నేహా పార్టీలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
 
టి20ల్లో తను ఎంత ప్రమాదకరమో క్రిస్ గేల్ (48 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 11 సిక్సర్లు) మరోసారి నిరూపించాడు. కళ్ల ముందు భారీ లక్ష్యం ఉన్నా... పూనకం వచ్చినోడిలా ఇంగ్లిష్ బౌలర్ల భరతం పట్టాడు. సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపిస్తూ టి20 ప్రపంచకప్‌లో అజేయ సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో కరీబియన్ జట్టు 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.


Advertisement
 
Advertisement
Advertisement