వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2026 టోర్నమెంట్‌లో వెస్టిండీస్ ఛాంపియన్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. షార్జా వేదికగా బంగ్లాదేశ్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విండీస్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
బంగ్లా ఓపెనర్ రోనీ తాలూక్దార్ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 56 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ కోల్పోయాడు. అతడితో పాటు ఫజ్లే మహ్మద్ (36 పరుగులు), కెప్టెన్ మహ్మదుల్లా (43 పరుగులు) ఆఖరిలో మెరుపులు మెరిపించారు. విండీస్ బౌలర్లలో రియాద్ ఎమ్రిట్స్ రెండు వికెట్లతో రాణించగా.. రేమన్ రీఫర్, డ్వేన్ బ్రావో చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం భారీ లక్ష్య చేధనలో కరేబియన్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. క్రిస్ గేల్(25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56), వాల్టన్(43 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 90) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. ఫలితంగా విండీస్ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది.
చదవండి: అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అత్యద్భుతం: శ్రేయస్ అయ్యర్


