వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మరోసారి మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. శుక్రవారం రాంచీ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో హోప్ అద్భుత సెంచరీతో కదం తొక్కాడు. ఈ కరేబియన్ వీరుడు 250 పరుగుల లక్ష్య చేధనలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి చివరి వరకు అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించాడు.
ఓవరాల్‌గా 45 బంతులు ఎదుర్కొన్న హోప్.. 6 ఫోర్లు, 9 సిక్స్‌లతో 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడు మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా ఈ కొండంత లక్ష్యాన్ని విండీస్ 18.3 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. విండీస్‌కు తమ టీ20 చరిత్రలో ఇదే అత్యధిక లక్ష్య చేధన కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించిన హోప్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీ
👉అంతర్జాతీయ టీ20ల్లో విండీస్ తరపున రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా హోప్ నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు కరేబియన్ లెజెండ్ క్రిస్ గేల్ (47 బంతుల్లో సెంచరీ) పేరిట ఉండేది.
తాజా మ్యాచ్‌లో కేవలం 45 బంతుల్లోనే శతకం పూర్తి చేసిన హోప్.. గేల్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ జాబితాలో జాన్సన్ ఛార్లెస్ (39 బంతులు) మాత్రమే హోప్ కంటే ముందున్నాడు.
👉టీ20ల్లో భారత్‌పై అత్యంత వేగంగా సెంచరీ సాధించిన రికార్డును హోప్ సమం చేశాడు. టీ20 ప్రపంచకప్ 2026లో ఇంగ్లండ్ ప్లేయర్ జాకబ్ బెథెల్ కూడా భారత్‌పై 45 బంతుల్లోనే శతకం సాధించిన విషయం తెలిసిందే.
చదవండి: అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అత్యద్భుతం: శ్రేయస్ అయ్యర్


