క్రికెట్‌తో రాజకీయాలు ముడిపెట్టవద్దు | Hopeful for India-Pakistan series to happen in December: PCB chief Shaharyar Khan | Sakshi
Sakshi News home page

క్రికెట్‌తో రాజకీయాలు ముడిపెట్టవద్దు

Oct 2 2015 1:27 AM | Updated on Sep 3 2017 10:18 AM

క్రికెట్‌తో రాజకీయాలు ముడిపెట్టవద్దు

క్రికెట్‌తో రాజకీయాలు ముడిపెట్టవద్దు

రాజకీయాలతో సంబంధం లేకుండా క్రికెట్ కొనసాగాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

కోల్‌కతా: రాజకీయాలతో సంబంధం లేకుండా క్రికెట్ కొనసాగాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఇటీవల మరణించిన జగ్మోహన్ దాల్మియా కుటుంబీకులకు సానుభూతి తెలిపేందుకు ఖాన్ కోల్‌కతాకు వచ్చారు. ‘ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు నిరంతరాయంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. రాజకీయాలతో క్రీడలను ముడిపెట్టడం తగదు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్‌లో భారత్‌తో సిరీస్ జరుగుతుందని ఆశిస్తున్నాను. మా ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అలాగే ఈ సిరీస్ జరుగకపోతే ఐసీసీ ఈవెంట్స్‌లో భారత్‌ను బాయ్‌కాట్ చేస్తామని నేను అనలేదు’ అని ఖాన్ తెలిపారు. మరోవైపు ఈసిరీస్ విషయమై దుబాయ్‌లో వచ్చే నెల జరిగే ఐసీసీ సమావేశాల సందర్భంగా చర్చిద్దామని బీసీసీఐ.. పీసీబీకి లేఖ రాసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement