'మీ విజయం.. నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది' | Hockey legend Balbir Singh Sr meets Dhoni & co | Sakshi
Sakshi News home page

'మీ విజయం.. నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది'

Mar 26 2016 8:03 PM | Updated on Sep 3 2017 8:38 PM

'మీ విజయం.. నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది'

'మీ విజయం.. నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది'

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అండ్ కోకు ఊహించని వ్యక్తి నుంచి ఆశీస్సులు అందుకున్నారు.

చండీగఢ్: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అండ్ కోకు ఊహించని వ్యక్తి నుంచి ఆశీస్సులు అందుకున్నారు. హాకీ లెజెండ్, మూడుసార్లు ఒలింపిక్స్ స్వర్ణపతకాలు సాధించిన భారత జట్టులో సభ్యుడు బల్బీర్ సింగ్ సీనియర్ (92).. మొహాలీ స్టేడియంలో భారత క్రికెట్ జట్టు సభ్యులను కలిశాడు. ఆదివారం ఈ వేదికపై ఆస్ట్రేలియాతో జరిగే టి-20 ప్రపంచ కప్ మ్యాచ్లో విజయం సాధించాలని అభినందనలు తెలిపాడు. ప్రపంచ కప్ను సాధించాలని ఆకాంక్షించాడు.

తమకు ఆశీస్సులు అందించిన బల్బీర్ సింగ్కు భారత క్రికెటర్లు కృతజ్ఞతలు చెప్పారు. బల్బీర్ ఆరోగ్యం గురించి భారత క్రికెటర్లు వాకబు చేయగా, మీ విజయం తనకు ఆరోగ్యాన్ని ఇస్తుందని ఆయన నవ్వుతూ సమాధానమిచ్చాడు. 1948 నుంచి 1956 వరకు మూడు ఒలింపిక్ పసిడి పతకాలు సాధించిన భారత హాకీ జట్టుకు బల్బీర్ ప్రాతినిధ్యం వహించాడు.

Advertisement
 
Advertisement
Advertisement