హాకీ లీగ్ చరిత్రలో రికార్డు వేలం | Hockey India League Auction | Sakshi
Sakshi News home page

హాకీ లీగ్ చరిత్రలో రికార్డు వేలం

Sep 17 2015 11:45 AM | Updated on Sep 3 2017 9:34 AM

హాకీ లీగ్ చరిత్రలో రికార్డు వేలం

హాకీ లీగ్ చరిత్రలో రికార్డు వేలం

హాకీ ఇండియా లీగ్ సీజన్ 4లో.. జర్మన్ మిడ్ ఫీల్డర్, టూ టైం ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మోర్టిజ్ రికార్డు సృష్టించాడు. లీగ్ చరిత్రలో తొలిసారి లక్ష డాలర్ల మార్క్ దాటేశాడు. ఇవాళ జరిగిన ఆటగాళ్ల వేలం లో కలింగ లాన్సర్స్ 1,05,000 డాలర్ల(భారత కరెన్సీలో 69లక్షలరూపాయల)కు మోర్టిజ్ ను కొనుగోలు చేసింది.

హాకీ ఇండియా లీగ్ సీజన్ 4లో.. జర్మన్ మిడ్ ఫీల్డర్, టూ టైం ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మోర్టిజ్ రికార్డు సృష్టించాడు. లీగ్ చరిత్రలో తొలిసారి లక్ష డాలర్ల మార్క్ దాటేశాడు. ఇవాళ జరిగిన ఆటగాళ్ల వేలం లో కలింగ లాన్సర్స్ 1,05,000 డాలర్ల (భారత కరెన్సీలో 69 లక్షల రూపాయల)కు మోర్టిజ్ ను కొనుగోలు చేసింది. జర్మనీకే చెందిన 2012 లండన్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఫార్వర్డ్  ఆటగాడు ఫ్లోరియన్ ఫుచ్స్, టోబియాస్ హుకే 63 లక్షల 54 వేల రూపాయులు  ధర పలికారు.

ఈ సీజన్ లో భారీ అంచనాలతో వేలంలో దిగిన భారత హకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ కోసం అన్ని జట్లు భారీగా పోటీ పడ్డాయి. 20 వేల డాలర్ల బేస్ ప్రైజ్ వద్ద వేలం ప్రారంభం కాగా.. పంజాబ్ వారియర్స్ 38 లక్షల 39వేల  రూపాయలకు సర్ధార్ ను దక్కించుకుంది. అయితే.. భారత ఆటగాళ్లు...రూపీందర్ పాల్ సింగ్, ధరమ్ వీర్ సింగ్ లు సర్ధార్ కంటే ఎక్కువ ధర పలికారు. ఢిఫెండర్ రూపీందర్ ను ఢిల్లీ వారియర్స్ 45 లక్షల రూపాయలకు  కొనుగోలు చేయగా.. ధరమ్ వీర్ సింగ్ ను కలింగ లాన్సర్స్ 39లక్షల71 వేల రూపాయలకు  దక్కించుకుంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెల్లీ ఫెయిర్‌వెదర్ వేలాన్ని పర్యవేక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement